రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగు దూకి రోడ్లపైకి ప్రవహిస్తున్నాయి. సిరిసిల్ల పట్టణ శివారులోని కొత్త చెరువుకు భారీగా వరద నీరు చేరడం వల్ల పూర్తిగా నిండి రోడ్లపైకి ప్రవహిస్తున్నది.
వేములవాడ, సిరిసిల్ల ప్రధాన రహదారి మీదకు కొత్తచెరువు అలుగు దూకడం వల్ల వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. భారీస్థాయిలో వరద నీరు రోడ్డు పైకి రావడం వల్ల శాంతినగర్‌లోని పలు ఇండ్లు జలమయమయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత కొత్త చెరువు పూర్తిగా నిండి అలుగు దూకుతుండటం వల్ల ప్రజలు ఓ వైపు భయపడుతూనే.. చెరువు అందాలను తిలకిస్తున్నారు.
రహదారిపైకి చేరిన వరద నీరు.. రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు దుకాణాల్లో చేరగా.. వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. చెరువు, నాలాలు ఆక్రమించడం వల్లే.. వరద నీరు నివాస, వ్యాపారప్రాంతాల వైపు ప్రవహించిందని.. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. నాలాలు మరమ్మత్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండిః తాను వాడే మాస్కులపై కేటీఆర్ ట్వీట్