రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మంద మకరంద్ ఇటీవల వెలువడిన ఆలిండియా సివిల్ సర్వీస్‌లో 110వ ర్యాంకు సాధించారు. మకరంద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సివిల్ సర్వీస్‌లో సెలెక్ట్ అయినందుకు మకరంద్‌ను ఎస్పీ అభినందించారు. అనంతరం శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. జిల్లా ఖ్యాతిని తెలంగాణ మొత్తం తెలియజేసిన మకరంద్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఇష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతులపై సర్కార్ కసరత్తు