రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని సింగసముద్రం అలుగు దూకడం వల్ల.. వరద నీటితో జాలువారుతున్న జలపాతాలు కనువిందుచేస్తున్నాయి. పూర్తిగా నిండి మత్తడి దూకుతున్న సింగసముద్రం కుంటాల, బొగత జలపాతాలను తలపిస్తున్నది. చాలా ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు దూకడం వల్ల ఆ ప్రాంతంలో పర్యటకుల సందడి నెలకొంది. ఎగువ మానేరు ప్రాజెక్టు ముచ్చటగా మూడోసారి అలుగు దూకగా.. గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలోని గొల్ల కేతమ్మ బండ దగ్గర ఉన్న పెద్ద కాలువకు భారీగా నీరు వచ్చి.. సముద్ర లింగాపూర్లోని సింగసముద్రం పూర్తిగా నిండింది. దీని సామర్థ్యం 0.3 టీఎంసీలు మాత్రమే. గత 2016 సంవత్సరంలో సింగసముద్రం నిండి అలుగు దూకగా.. మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మత్తడి దూకుతున్నది.
సింగసముద్రం ఆయకట్టు కింద సుమారు 2,265 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ప్రస్తుతం సింగసముద్రం మత్తడి దూకడం వల్ల ఎల్లారెడ్డిపేట మండలం లోని జక్కలచెరువులో నీటిమట్టం పెరగడం వల్ల అక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత సింగసముద్రం పూర్తిగా నిండి మత్తడి దూకుతూ.. కుంటాల, బొగత జలపాతాలను మరిపించేలా ఇక్కడి జలపాతాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
ఇవీ చూడండి: నాలాలు ఉన్నచోట.. పోలీసుల సూచనలు!