రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, అసిస్టెంట్ కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షించారు.
కౌంటింగ్ కేంద్రంలో వసతులను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించాలని సూచించారు.
- ఇదీ చూడండి : '90శాతానికి పైగా వార్డుల్లో గులాబీ రెపరెపలు'