రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లకు చెందిన ఇస్కిల్ల రాజయ్య కుటుంబానికి మంత్రి కేటీఆర్ ఇల్లు మంజూరు చేశారు. రాజయ్య ఈ నెల 21న అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మృతుని భార్య జ్యోతి, తల్లి ఆగవ్వ, పిల్లలు అర్చన, నవ్యస, అరవింద్ అనాథలయ్యారు. ఉండటానికి ఇళ్లు కూడా లేదు. అంత్యక్రియలు కూడా టెంట్ వేసి నిర్వహించారు.
ఇది చూసి చలించిన మంత్రి కేటీఆర్ రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాల్సిందినగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ కృష్ణ భాస్కర్ రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేసి... ఇవాళ తన ఛాంబర్లో బాధిత కుటుంబానికి ఉత్తర్వుల కాపీని రాజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుని భార్య జ్యోతి మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: నీరు, కరెంట్ ఫ్రీ, ఆస్తిపన్ను మాఫీ: భాజపా హామీలు