సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుమన్ మోహన్ రావు ఆదేశించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. మూవీ ట్రాఫిక్ పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు.
వెంకట్రావుపల్లిలో కరోనా బారినపడిన వారితో నేరుగా మాట్లాడారు. హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే యాంటిజెన్ రాపిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడేగా పరిగణిస్తూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్ గణపయ్య