ETV Bharat / state

Podu controversy: గర్జనపల్లిలో మళ్లీ రాజుకున్న పోడు వివాదం.. పోలీసుల మోహరింపు - sirscilla district latest news

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీశాఖ సిబ్బంది యత్నించగా.. స్థానిక దళిత రైతులు అడ్డుకున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేజారకుండా పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు.

Podu controversy: గర్జనపల్లిలో మళ్లీ రాజుకున్న పోడు వివాదం.. పోలీసుల మోహరింపు

author img

By

Published : Sep 12, 2021, 5:29 PM IST

Updated : Sep 12, 2021, 5:48 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో పోడు భూముల సమస్య మళ్లీ రాజుకుంది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిని స్థానిక దళిత రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగి.. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Podu controversy: గర్జనపల్లిలో మళ్లీ రాజుకున్న పోడు వివాదం.. పోలీసుల మోహరింపు

గ్రామంలోని దాదాపు వందకు పైగా దళిత కుటుంబాలు సుమారు 80 ఎకరాల పోడు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం అటవీ శాఖ అధికారులు ఈ భూముల్లో హరితహారం పనులు చేపట్టేందుకు రాగా.. దళిత రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు, రైతులకు మధ్య వివాదం జరిగింది. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో అధికారులు హరితహారం పనులు తాత్కాలికంగా నిలివేస్తున్నామని ప్రకటించారు.

ఇప్పుడు తాజాగా పోలీసుల సహకారంతో అటవీశాఖ అధికారులు మళ్లీ పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు సిద్ధమవగా.. దళిత రైతులు అడ్డుకున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న వివాదం.. మళ్లీ చెలరేగింది. దీంతో పరిస్థితి చేజారకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. రైతులను పోడు భూముల్లోకి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. ఫలితంగా గర్జనపల్లి అటవీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చూడండి: Praja Sangrama Yatra: అధైర్యమొద్దు.. అండగా ఉంటా.. రైతులకు సంజయ్ భరోసా

Last Updated : Sep 12, 2021, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.