ETV Bharat / state

'అందరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్'

author img

By

Published : Apr 14, 2021, 9:19 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్​ పర్యటించారు. పట్టణంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Planning Commission Vice President
రాజ్యాంగ నిర్మాత

రాజ్యాంగ నిర్మాతను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. బీఆర్ అంబేడ్కర్​ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సిరిసిల్ల పట్టణంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో.. ఎమ్మెల్యే రవిశంకర్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

స్వేచ్ఛ, సమానత్వం, భాగస్వామ్యం అనే పునాదుల మీద రాజ్యాంగానికి రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్​ అంటూ వినోద్​ కొనియాడారు. అమెరికా రాజ్యాంగాన్ని క్షుణ్నంగా పరిశీలించి.. అక్కడి మహిళలకు, నల్ల జాతీయులకు ఓటు హక్కు లేదని గుర్తించిన అంబేడ్కర్​.. దేశంలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారని వివరించారు. అందరూ.. మహనీయుడి​ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు సముద్రంలోకి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.