రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో కోతుల బెడద తప్పించుకోవడానికి గ్రామస్థులు ఏకతాటిపై నిలబడ్డారు. కోతులు పట్టేవారిని తీసుకువచ్చి, గ్రామంలో ఉన్న కోతులను పట్టేందుకు వారితో ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు గాను ఇంటికి రూ.50 చొప్పున వసూలు చేసి, వారికి చెల్లించారు. ఇప్పటి వరకు సుమారు 200 కోతులను పట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చూడండి:మొక్కజొన్నకు మిడతల గండం