సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల.. ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంది. ఈ బడి కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దు కోవడాన్ని సోషల్ మీడియా, గూగుల్ యాప్ ద్వారా చూసిన పూర్వ విద్యార్థులు.. ఓ సమ్మేళనం ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
40 ఏళ్ల తర్వాత..
సుమారు పది రోజులుగా శ్రమించి.. 1956 నుంచి1996 వరకు చదివిన వారికి సమాచారం అందించారు. వారందరి కోరిక మేరకు వివిధ హోదాల్లో స్థిరపడి.. సుమారు 40 ఏళ్ల తర్వాత అందరూ ఒకే వేదిక పైకి వచ్చి.. ఆనందంగా గడిపారు.
అపూర్వ సమ్మేళనం..
పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించుకున్నారు. ఇలాంటి సమ్మేళనం జరుపుకోవడం వల్ల సమాజంలో మానవ సంబంధాలు మెరుగు పడతాయని.. వారు అంటున్నారు.
గత స్మృతులను గుర్తుచేసుకొని ..
40 ఏళ్ల తర్వాత అందరూ ఒకే చోట కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని.. పూర్వ విద్యార్థులు సంబరపడిపోయారు. విద్యాబుద్ధులు నేర్చుకుని.. వివిధ హోదాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు.. చిన్నపిల్లలుగా మారిపోయి.. గత స్మృతులను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు.
సంబంధిత కథనాలు: