దేశంలో ఏ బ్యాంకు చేయని విధంగా.. లాక్డౌన్ లోనూ రూ. లక్షా 80 వేల కోట్లను నాబార్డ్, వ్యవసాయ రుణాల కింద కేటాయించిందని సంస్థ ఛైర్మన్ గోవిందరాజులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఓ గోదాం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి టెస్కాబ్ ఛైర్మన్ కె. రవీందర్తో కలసి ఆయన హాజరయ్యారు.
వ్యవసాయ, ఇతర రంగాల్లో ఉపాధి కోసం రూ.2 లక్షల కోట్ల రుణాలను కేటాయించి..సహకార సంస్థలను నాబార్డ్ బలోపేతం చేస్తోందని గోవిందరాజులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చిన్న తరహా రంగాల కోసం రూ. 5 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు.