ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్ జిల్లా​ వ్యాప్తంగా జోరుగా నామినేషన్లు - latest news on municipal elections in joint karimnagar

రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం పురపాలక ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. మొదటి రోజైన బుధవారం అభ్యర్థులు ఉత్సాహంగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మున్సిపల్​ కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో తొలిరోజు 58 నామినేషన్లు దాఖలయ్యాయి.

muncipal elections news on joint karimnagar district
ఉమ్మడి కరీంనగర్ జిల్లా​ వ్యాప్తంగా జోరుగా నామినేషన్లు
author img

By

Published : Jan 9, 2020, 1:40 PM IST

రాష్ట్రంలో పురపాలక ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్​ విడుదల కావడంతో నామినేషన్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో తొలిరోజు నామినేషన్లు జోరుగా సాగాయి.

కరీంనగర్‌ జిల్లాలో హుజూరాబాద్​, జమ్మికుంట 2 పురపాలక సంఘాలు ఉండగా.. మొదటి రోజు 21 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో హుజూరాబాద్​లో 11 నామినేషన్లు దాఖలవగా... జమ్మికుంటలో 10 నామినేషన్లు దాఖలయ్యాయి.

జగిత్యాలలో...
జగిత్యాల మున్సిపాలిటీలో 48 వార్డులకు గానూ తొలిరోజు నామినేషన్ల దాఖలుకు అంతగా స్పందన కనిపించలేదు. రేపటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

పెద్దపల్లిలో...

పెద్దపెల్లి జిల్లాలో 2 పురపాలక సంఘాలు ఉండగా.. మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లి పురపాలికలో 36 వార్డులకు గానూ 5 నామినేషన్లు, సుల్తానాబాద్ పురపాలిక​లో 15 వార్డులకు గానూ 2 నామినేషన్లు దాఖలయ్యాయి.

రాజన్న సిరిసిల్లలో...

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీలో 39 వార్డులకు గానూ అధికారులు 13 నామినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు 19వ వార్డు నుంచి అన్నారం శ్రీనివాస్​, 6వ వార్డు నుంచి గొల్లపల్లి రామానుజన్​లు తెరాస తరఫున నామినేషన్​ దాఖలు చేయగా.. 38 వార్డు నుంచి రిక్కుమల్ల సంపత్​, 2వ వార్డు నుంచి కాంగ్రెస్​ అభ్యర్థి మడుపు శ్రీదేవి నామినేషన్​లు దాఖలు చేశారు.

హుస్నాబాద్​లో...

పూర్వపు కరీంనగర్​ జిల్లాలోని హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గానూ మొదటి రోజు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తెరాస నుంచి 6, కాంగ్రెస్​ నుంచి 9, భాజపా నుంచి 1, 1 స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు​ వేశారు.

తెరాసలో ఎక్కువ మంది ఆశావాహులు పార్టీ టికెట్లు ఆశిస్తుండడం వల్ల అభ్యర్థుల ఎంపికలో తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా చివరి రోజైన శుక్రవారం నామినేషన్లు అధికంగా దాఖలయ్యే అవకాశం ఉంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా​ వ్యాప్తంగా జోరుగా నామినేషన్లు

ఇవీచూడండి: పురపోరుకు ములుగు ఎందుకు దూరమైంది..?

Intro:TG_KRN_62_08_SRCL_NAMINETIONS_AV_G1_TS10040_HD

( ) రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.
పట్టణంలోని 39 వార్డులకు గాను 13 నామినేషన్ల కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొదటిరోజు మధ్యాహ్నం వరకు 19 వ వార్డు నుంచి అన్నారం శ్రీనివాస్, 6 వ వార్డు నుంచి గొల్లపల్లి రామానుజన్ లు తెరాస తరఫున నామ పత్రాలు ఎన్నికల అధికారులకు అందజేశారు. అన్నారం శ్రీనివాస్ తన అనుచరులతో పాటు, తెరాస కార్యకర్తలతో భారీ ర్యాలీ తీసి నామినేషన్ కేంద్రానికి చేరుకొని నామ పత్రాలు అందజేశారు. 38వ వార్డు నుంచి రిక్కుమల్ల సంపత్, 2 వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడుపు శ్రీదేవి నామ పత్రాలను అందజేశారు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ కార్యాలయం లో నామినేషన్ పత్రాల స్వీకరణ.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.