రాష్ట్రంలో జరిగిన దిశ ఘటనపై క్షణాల్లో స్పందించిన మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో ఎస్సీ విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపులపై ఎందుకు స్పందించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ను ఆయన సందర్శించారు. జరిగిన విషయాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
హామీ ఇవ్వాలి:
ఈ హాస్టల్ విద్యార్థుల సంఘటనపై ప్రజా, విద్యార్థి సంఘాలు, సమాజం స్పందించిన మంత్రి కేటీఆర్, స్థానిక తెరాస నాయకులు స్పందించకపోవడం బాధాకరమని మందకృష్ణ అన్నారు. కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలోని హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు వారం రోజులు గడువు ఇస్తున్నామన్నారు. అలా జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: కాకతీయ కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు