ETV Bharat / state

'రాయల్'​​​ ఆలోచన... బార్బెక్యూ చికెన్​​​ సూపర్​...

author img

By

Published : Jan 9, 2021, 6:39 PM IST

నూతనంగా కొనుగోలు చేసిన తనకిష్టమైన రాయల్ ఎన్​​ఫీల్డ్​ బైక్​ను సరికొత్త మొబైల్ హోటల్​గా మార్చేశాడు ఓ యువకుడు. బండిపై బార్బెక్యూ చికెన్ తయారు చేసి అందరి చేత లొట్టలేయిస్తున్నాడు. తన వినూత్న ఆలోచనతో అందరి చేత వారెవ్వా అనిపించుకుంటున్నాడు.

'రాయల్'​​​ ఆలోచన... బార్బెక్యూ చికెన్​​​ సూపర్​...
'రాయల్'​​​ ఆలోచన... బార్బెక్యూ చికెన్​​​ సూపర్​...

ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి కానరాని దేశం వెళితే అక్కడ ఉపాధి లేక అప్పులపాలై స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించి అందరి చేత లొట్టలేయిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామానికి చెందిన బట్టు బాలకిషన్.. సొంతగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. అందరిలా కాకుండా అందరినీ ఆకర్షించేలా చేయాలని సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.

తనకొచ్చిన ఆలోచనకు తను నూతనంగా కొనుగోలు చేసిన రాయల్ ఎన్​ఫీల్డ్​ బైక్​నే ప్రధాన వేదికగా మార్చుకున్నాడు. రూ.రెండు లక్షలతో కొన్న తన బైక్​కు మరో లక్ష పెట్టుబడి పెట్టి.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ను ఓ మొబైల్ హోటల్​గా మార్చేశాడు.

బైక్​కు అమరేలా ఓ ప్రత్యేకమైన బాక్స్ చేయించాడు. ఆ బాక్స్​లోనే పొయ్యి ఏర్పాటు చేసుకొని దానిపై బార్బెక్యూ చికెన్ తయారు చేస్తూ... అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రుచికరమైన బార్బెక్యూ చికెన్​ తినడానికి గ్రామస్థులు ఆసక్తి చూపుతున్నారు. చికెన్​ ఘుమఘుమలతో పాటు... రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఐడీయా పలువురిని ఆకర్షిస్తోంది. ఈ వాహనంపై ఎంత దూరమైనా వెళ్లి వ్యాపారం చేసుకోవచ్చని బాలకిషన్ చెప్తున్నాడు. మండలంలోని గ్రామాల్లో సంచరిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.

ఇదీ చదవండి: కల్లు కలకలం: ఆస్పత్రుల్లో 100 మంది... ముగ్గురి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.