ETV Bharat / state

'స్మారకార్థం క్రీడల నిర్వహణ అభినందనీయం' - ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ తాజా వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా జవారిపేట గ్రామంలో నిర్వహించిన క్రీడల బహుమతి ప్రదానోత్సవంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ పాల్గొన్నారు. వివిధ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన ఆటగాళ్లకు ఆయన బహుమతులు అందజేశారు.

mla rasamai balakishan participate in commemorative sports rajanna siriscilla
'స్మారకార్థం క్రీడల నిర్వహణ అభినందనీయం'
author img

By

Published : Jan 18, 2021, 7:58 PM IST

కీర్తిశేషుల స్మారకార్థం క్రీడలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామంలో ఎల మల్లవ్వ స్మారకార్థం ఎల రాజు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ క్రీడల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన చెస్​, షటిల్​, టెన్నికాయిట్​, ముగ్గుల పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన ఆటగాళ్లకు బహుమతులను ఎమ్మెల్యే బాలకిషన్​ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ అన్నాడి అనంతరెడ్డి, ఎస్సై రఫీక్ ఖాన్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం: సబితా ఇంద్రా రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.