ETV Bharat / state

mission bhagiratha pipes: మొన్నేమో పైపులు కొట్టుకుపోయాయి.. కొత్తవి వేశాక లీకవుతున్నాయి! - telangana varthalu

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన దగ్గర మిషన్ భగీరథ పైప్​లైన్ లీకై(mission bhagiratha water pipeline Leakage) నీరు ఉప్పొంగింది. ఎగిసి పడుతున్న నీటితో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

mission bhagiratha pipes: మొన్నేమో పైపులు కొట్టుకుపోయాయి.. కొత్తవి వేశాక లీకవుతున్నాయి!

author img

By

Published : Oct 1, 2021, 6:50 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన దగ్గర మిషన్ భగీరథ పైప్‌లైన్‌(mission bhagiratha water pipeline Leakage) లీకైంది. పైప్‌లైన్‌ లీకవడంతో నీరు ఉప్పొంగింది. రహదారిపై పెద్దఎత్తున నీరు ఎగిసిపడింది. నీరు ఉప్పొంగడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు గంట పాటు భగీరథ నీరు వృథా అయింది.

దీనితో విషయం తెలుసుకున్న మున్సిపల్​ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తాత్కాలికంగా నీరు రహదారిపైకి రాకుండా కట్టడి చేశారు. మిషన్​ భగీరథ అధికారులకు సమాచారం ఇచ్చి నీటి సరఫరాను నిలిపివేయాలని కోరారు. మరోవైపు లీకేజీ ద్వారా(mission bhagiratha water pipeline Leakage) ఎగిసిపడుతున్న నీటి దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఆ నీటి పక్కన ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు.

అప్పుడు కొట్టుకు పోయాయి.. ఇప్పుడేమో..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి తంగళ్లపల్లికి గతంలో వంతెన కింది నుంచి మిషన్​ భగీరథ పైపులను వేశారు. వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఆ పైపులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇటీవల పైపులను వంతెన పైనుంచి వేసి... ఇవాళే నీటిని వదిలారు. కాసేపటికే మానేరు వంతెన దగ్గర పైప్​లైన్​ నుంచి నీరు ఉప్పొంగింది. గమనించిన స్థానికులు వెంటనే మున్సిపల్​ అధికారులకు సమాచారం అందించగా.. వారు తాత్కాలికంగా కట్టడి చర్యలు చేపట్టారు. మిషన్​ భగీరథ పైపులు సరిగా బిగించకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మిషన్ భగీరథ పైప్​లైన్ లీకేజీ

ఇదీ చదవండి: ఎరుపు రంగు చూసి ఆవు బీభత్సం- మహిళలపై దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.