కంటైన్మెంట్ జోన్లో నివసిస్తున్న ప్రజలంతా అధైర్య పడొద్దని.. అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కంటైన్మెంట్ జోన్లో ఆయన పర్యటించారు. అధికారులు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు.
నిత్యవసర సరకులు, అత్యవసర సేవల కోసం అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు కేటీఆర్ సూచించారు. కొంతసేపు స్థానికులతో మాట్లాడారు... వారి సమస్యలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని... కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మంత్రి వెంట జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ, కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే ఉన్నారు.
ఇవీచూడండి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన