రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నదులు, వాగుల వెంబడి గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనేది సీఎం ఆలోచన అని చెప్పారు. అటవీ సంపద పెంపొందించే కార్యక్రమాన్ని మెదక్ జిల్లాలో సీఎం ప్రారంభించారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 33 శాతం భూభాగంలో అడవులు పెంపొందాలనేది సీఎం లక్ష్యమని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు జిల్లాలో కోటి 40 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. సంక్షోభంలో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదని వివరించారు.
ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా రైతుబంధు అందజేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేశామని తెలిపారు. దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారిందని ఎఫ్‌సీఐ చెప్పిందని గుర్తు చేశారు.
ఇవీచూడండి: సిరిసిల్ల జిల్లాలో హరితహారం.. మొక్కలు నాటిన కేటీఆర్, పోచారం