ETV Bharat / state

జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులతో కేటీఆర్‌ సమీక్ష - minister ktr review for development

రాజన్న సిరిసిల్లకు రైల్వేలైన్ రాకతో జిల్లా ముఖచిత్రం మారనుందని రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు జలాశయం అతిథిగృహంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

minister ktr review
జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులతో కేటీఆర్‌ సమీక్ష
author img

By

Published : Feb 11, 2020, 6:24 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై... గంభీరావు పేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు జలాశయం అతిథిగృహంలో జిల్లా అధికారులతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. జిల్లాలో రైల్వేలైన్‌కు అవసరమైన 845 ఎకరాల భూమి అత్యంత పకడ్బందీగా సేకరించి రైల్వే అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. త్వరితగతిన భూసేకరణ చేస్తే... సిరిసిల్ల జిల్లా ప్రజలకు 2022 వరకు రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.

పది రోజుల్లో శంకుస్థాపన..!

ధవళేశ్వరం మాదిరిగా మద్య మానేరు జలాశయం బ్యాక్ వాటర్‌పై రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి, మానేరు వాగుపై ఉన్న ఎగువ మానేరు జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. పది రోజుల్లో నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అతిథిగృహం ఆధునీకరణ, పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అంబరాన్నంటేలా ఆవిర్భావ వేడుకలు..

ఏటా జూన్ 2న నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు... ఈ సారి అంబరాన్నంటేలా నిర్వహించాలని కేటీఆర్‌ అన్నారు. 92 ఎకరాల్లో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో వేడుకలు నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సూచించారు. సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోనే... కోర్టు కాంప్లెక్స్, అతిథి గృహ, జాతీయ స్థాయి స్టేడియం, శాశ్వత పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. కలెక్టరేట్‌ను ఆనుకొని ఉన్న చంద్రగిరి, రామప్ప గుట్టలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. సిరిసిల్ల పట్టణంలో మినీ జూ అర్బన్ లాంగ్ స్పేస్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం జలాలతో కళకళలాడాలి..

కాళేశ్వరం ప్రాజెక్టు 9, 10,11,12 ప్యాకేజీ పనుల పురోగతిపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో కేటీఆర్‌ సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో నిర్మించనున్న చెక్‌డ్యాంలతో... ఎగువ మానేరు జలాశయం నుంచి మధ్య మానేరు జలాశయం వరకు మానేరు నది సజీవ జలదృశ్యంతో కళకళలాడుతోందని మంత్రి అన్నారు. జిల్లాలోని 664 చెరువులకు గానూ 374 చెరువులను కాలేశ్వరం ప్రాజెక్టు నీటితో నింపడం వల్ల 6.6 టీఎంసీల నీరు ఒడిసిపట్టొచ్చన్నారు. తద్వారా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి సశ్యశ్యామలంగా మారుతోందన్నారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులతో కేటీఆర్‌ సమీక్ష

ఇదీ చూడండి: దిల్లీ దంగల్​ : హస్తిన పీఠం ఎవరిదో తేలేది నేడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.