ETV Bharat / state

రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు: కేటీఆర్ - Minister ktr sircilla tour news

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో రైతుల జీవితాల్లో గణనీయ ప్రగతి వచ్చిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించిన మంత్రి... అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పలుచోట్ల రైతు వేదికలతో పాటు నర్మాలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుకు శంకుస్థాపన చేశారు.

రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు: కేటీఆర్

author img

By

Published : Feb 8, 2021, 7:59 PM IST

రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు: కేటీఆర్

సొంత నియోజకవర్గం సిరిసిల్లలోని గంభీరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్‌... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గంభీరావుపేటలో నానమ్మ-తాతయ్యల పేరు మీద సొంతంగా నిర్మించిన రైతువేదిక ప్రారంభించారు. రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడేందుకే రైతువేదికలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్న మంత్రి... అన్నదాతలు నేరుగా శాస్త్రవేత్తలతో మా‌ట్లాడేందుకు రైతువేదికల్లో అంతర్జాల సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు.

అండగా ఉంటాం...

మధ్యమానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా ఉంటామని స్పష్టం చేసిన కేటీఆర్... ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కొంతమంది నష్టపోయినా... లక్షల మందికి ఉపయోగపడుతాయని గుర్తుచేశారు. రాష్ట్ర గ్రామీణ ఆర్థిక స్థితిగతుల్ని మార్చేందుకు...శ్వేత, నీలి, గులాబీ, హరిత విప్లవాలు ఆవిష్కరిస్తున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఏకైక రాష్ట్రం తెలంగాణే...

మండలంలోని నర్మాలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి... రైతులకు గిట్టుబాటు ధర కోసమే ఈ పరిశ్రమలు తెస్తున్నట్లు వెల్లడించారు. కరోనా సమయంలోనూ ప్రతీ గింజను కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేని ఉద్ఘాటించారు. గత ఆరున్నరేళ్లలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడితే భూముల ధరలు పెరుగుతాయన్న మంత్రి... అప్పర్ మానేరును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలు...

పర్యటనలో భాగంగా గంభీరావుపేటలో డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాఠశాలను కేటీఆర్‌ ప్రారంభించారు. మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణ పత్రాలు పంపిణీ చేశారు. నర్మాలలో శ్మశానవాటిక, పాఠశాలలో అదనపు తరగతిగదులను ప్రారంభించారు. కొత్తపల్లిలో మహిళాసంఘం నూతన భవనంతో పాటు లింగన్నపేటలో రైతువేదికను ప్రారంభించారు.

ఇదీ చదవండి: కేటీఆర్ సొంత నిధులతో గంభీరావుపేట రైతు వేదిక నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.