ETV Bharat / state

కరోనా బాధితులను వెలివేసినట్లు చూడడం సరికాదు: కేటీఆర్​ - సిరిసిల్లలో కొవిడ్​ ఐసీయూ వార్డు ప్రారంభం

కరోనా ఉద్ధృతమైతే రెండు పడక గదుల ఇళ్లను ఐసోలేషన్​ కేంద్రాలుగా వినియోగించాలని మంత్రి కేటీఆర్​ సూచించారు. సిరిసిల్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. సీఎస్‌ఆర్‌ పథకం జిల్లా ఆస్పత్రికి రూ.2.28 కోట్లు ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు

KTR
కరోనా బాధితులను వెలివేసినట్లు చూడడం సరికాదు: కేటీఆర్​
author img

By

Published : Aug 3, 2020, 3:17 PM IST

Updated : Aug 3, 2020, 3:58 PM IST

కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేయాల్సింది చేస్తోందని...ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు. ప్రజలు నిర్లక్ష్య ధోరణి వీడి కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి... ప్రజాప్రతినిధులు ప్లాస్మాదానంలో ముందుండి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు.

కరోనా బాధితులను అంటరానివారుగా చూడొద్దని...వారిలో ధైర్యం నింపేలా ప్రజలు వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. సిరిసిల్లలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ ఐసీయూ వార్డు, 40 పడకల ఆక్సిజన్ వార్డును మంత్రి ప్రారంభించారు. ప్రత్యేక కొవిడ్ అంబులెన్స్​లను జెండా ఊపి వినియోగంలోకి తీసుకొచ్చారు.

అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో 32 పడకల ఐసోలేషన్‌ వార్డు ప్రారంభించారు. ఆసుపత్రికి మరో రూ.2.28 లక్షలు సీఎస్​ఆర్​ నిధుల కింద సమకూర్చుతామన్నారు. తనవంతుగా రూ.20 లక్షలు ఇస్తున్నానని తెలిపారు. జిల్లాలో రోజుకు 1000 టెస్టుల సామర్థ్యానికి అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా బాధితుల పట్ల మానవత్వంతో ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కరోనా కోసం..

వైద్య పరికరాలు సౌకర్యాల కొరత లేనప్పటికీ.. ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కేసులు పెరుగుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. కరోనా కోసం జీవనం, జీవితం ఆగదని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

ప్రభుత్వానికి సహకరించాలి..

కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శలు మాని మహమ్మారి కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ప్రభుత్వమే కరోనా కట్టడి చేయాలనే ఆలోచనను ప్రజలు వీడాలని కేటీఆర్‌ కోరారు. సమష్టిగా కృషి చేస్తేనే మహమ్మారిని ఎదుర్కోగలమని తెలిపారు. ప్లాస్మాదానానికి ముందుకు రావడం లేదన్న వార్తలు బాధాకరమన్న మంత్రి... ప్రజాప్రతినిధులు ప్లాస్మాదానంలో ముందుండి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఇవీచూడండి: అన్న కేటీఆర్​కు రాఖీ కట్టిన కవిత

Last Updated : Aug 3, 2020, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.