KTR inaugurated Double bed room houses: సిరిసిల్ల జిల్లా రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్‌లో రెండు పడకగదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఎవరూ అడిగే అవసరం లేకుండా ప్రజలకు అన్నీ అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలకు విమర్శలు చేయడం సులభం.. కానీ పనులు చేయడమే కష్టమన్న కేటీఆర్.. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నా విమర్శకులకు కనిపించట్లేదని మండిపడ్డారు. వెంకటాపూర్ అభివృద్ధి బాటలో ముందుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గూడు లేని పేదలు ఉండకూడదన్న కేటీఆర్.. అడిగే అవసరం లేకుండా ప్రజలకు అన్నీ ఇస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. త్వరలోనే సిరిసిల్ల జిల్లాకు ఒక మెడికల్, ఇంజినీరింగ్ కళాశాల రాబోతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోతల్లేని విద్యుత్ ఉందని ఏ రైతును పలకరించినా చెబుతారని వెల్లడించారు.
"కోట్లాది అభివృద్ధి పనులు జరుగుతున్నా విమర్శకులకు కనిపించట్లేదు. కోతల్లేని విద్యుత్ ఉందని ఏ రైతును పలకరించినా చెబుతారు. అర్హులైన అందరికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. రాష్ట్రంలో గూడు లేని పేదలు ఉండకూడదు. అడిగే అవసరం లేకుండా ప్రజలకు అన్నీ ఇస్తున్నాం. విమర్శలు చేయడం సులభం...పనులు చేయడమే కష్టం." -కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
ఇదీ చదవండి: కొనసాగుతున్న విద్యార్థుల రాక.. దిల్లీకి చేరుకున్న మరో 145 మంది విద్యార్థులు