ETV Bharat / state

Minister KTR: 'అడిషనల్​ కలెక్టర్​ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం' - ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​

ఇటీవల కరోనాతో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబసభ్యులు ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్​ను కలిశారు. అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు.

minister ktr gave guarantee to siricilla additional collector anjaiah's family who died with corona
'అడిషనల్​ కలెక్టర్​ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం'
author img

By

Published : Jun 8, 2021, 8:03 PM IST

ఇటీవల కరోనాతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం అంజయ్య కుటుంబసభ్యులు ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్​ను కలిశారు.

అంజయ్య చాలా సమర్థ అధికారి అని, ఆయన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్​గా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంజయ్య కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే అన్ని విధాలుగా వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్​న్యూస్​... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.