ETV Bharat / state

KTR on PM Modi: 'నమో అంటే... నమ్మించి మోసం చేయడం' - telangana news

KTR on PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తల భేటీలో కేటీఆర్ పాల్గొన్నారు.

KTR
KTR
author img

By

Published : Feb 18, 2022, 7:34 PM IST

'నమో అంటే... నమ్మించి మోసం చేయడం'

KTR on PM Modi: అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణకు అర పైసా సాయం చేయకుండా.. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తల భేటీలో కేటీఆర్ పాల్గొన్నారు. సమగ్ర అభివృద్ధితో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై అక్కసు ఎందుకని ప్రశ్నించారు. ఇటీవల నరేంద్రమోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కాపీ కొట్టి...

తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న భాజపా నేతలకు ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండాలా? వద్దా? ఆలోచించుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. మిషన్‌ భగీరథకు రూ.14 వేల కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేస్తే.. తెలంగాణకు మోదీ 24 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. మిషన్‌ భగీరథ పథకాన్ని సిగ్గులేకుండా కాపీ కొట్టి హర్‌.. ఘర్‌.. జల్‌ అని డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. 2014లో ఒక్కో భారతీయుడి ఖాతాలో రూ.16 లక్షలు వేస్తామని మోదీ చెప్పారు.. ఎవరి ఖాతాలో అయినా రూ.16 లక్షలు వేశారా? ఏటా 2కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు.

అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్నారు. భాజపా, మోదీకి జవాబివ్వాల్సిన బాధ్యత కార్యకర్తలదే. 2014లో నమో (నరేంద్ర మోదీ) పేరిట ఓట్లు అడిగారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమని ప్రచారం చేయాలి. మోదీ కేవలం ఉత్తర భారత్‌, ఉత్తరాఖండ్‌కే ప్రధానా? తెలంగాణకు వేరే ప్రధాని ఉన్నారా? అని నిలదీయాలి.

-- కేటీఆర్‌, మంత్రి

నమో అంటే ఏంటంటే...

వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌, వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్, వన్‌ నేషన్.. వన్‌ రిజిస్ట్రేషన్‌ అంటున్నారు. ఒకే దేశంలో ఒకే తప్పు జరిగింది. అది 2014లో మోదీని నమ్మి గెలిపించడమే. 2014లో నమో అన్నారు. నమోని నమ్మి 8ఏళ్లు మోసపోయాం. నమో.. అంటే నరేంద్రమోదీ కాదు.. నమ్మించి మోసం చేసేవాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీవితాలు మార్చు నాయనా.. అని అధికారమిస్తే ఉన్న జీవిత బీమా సంస్థను కూడా అమ్మేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ గెలిచి 3 ఏళ్లు అవుతోంది... వేములవాడ రాజన్న కోసం కనీసం 3 పైసలు తెచ్చారా? అయోధ్యలో రాముడు ఒక్కరే ఉన్నారా? వేములవాడలో రాజన్న లేరా? అని ప్రశ్నించారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని 8 ఏళ్ల నుంచి కేంద్ర మంత్రులను అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఒక్క పైసా కూడా రాలేదు అని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: KTR Baddena Tour: 'దేశానికి అన్నదాతల శక్తి చాటేందుకే రైతు వేదికలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.