రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి, తాడూరు గ్రామాల్లో పెళ్లి శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో కీర్తిశేషులు ఈనాడు సీనియర్ పాత్రికేయులు నాగభూషణం కూతురు వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగే శుభకార్యాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
ఇదీ చూడండి: ఏడేళ్ల చిన్నారిపై 73 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం