రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. స్వగ్రామంలో ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని.. మొక్కలు నాటారు.
ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కొప్పుల కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను గ్రామాల్లో విస్తృతంగా చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
ఇదీ చదవండి: ఎంపీ సంతోశ్ కుమార్ స్వగ్రామంలో కోటి వృక్షార్చన