మధ్య మానేరు నుంచి వేములవాడ గుడి చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించే పథకాన్ని ప్రారంభించేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేములవాడలో పర్యటిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. గర్భ గుడిలో ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ ఈవో.. స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించి సత్కరించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు, జడ్పీ ఛైర్పర్సన్ నేలకొండ అరుణ ఉన్నారు.
వేములవాడ ఆలయంలో ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు - minister-indra-karan-at-vemulawada-temple
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.