రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పలు దుకాణాలపై తూనికలు, కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. దుకాణాల్లో సరైన బిల్లులు లేకుండా, ప్యాకింగ్‌పై వివరాలు లేని పలు దుకాణ యజమానులకు జరిమానా విధించారు.
లాక్డౌన్లో ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్నారని జిల్లా మెట్రాలజీ అధికారి రవీందర్ తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.