రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో విద్యుత్ షాక్తో తవుటు రేనా అనే వివాహిత మృతి చెందింది. మంగళవారం ఉదయాన్నే మోటర్ ఆన్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి భర్త రాజం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లినట్ల పేర్కొన్నారు.
కరోనా లాక్డౌన్ కారణంగా రాజం అక్కడే ఉండిపోయాడు. భార్య మృతి చెందిన వార్త విన్న ఆయన... ఆమె మృతదేహాన్ని చరవాణిలో వీడియో కాల్ ద్వారా చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలికి కుమారుడు పవన్, కుమార్తె సౌమ్యలు ఉన్నారు.