రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని వేములవాడలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. వట్టెంల గ్రామానికి చెందిన గొల్లపల్లి వినోద్ ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎంపీటీసీ టికెట్ రాకపోవడం వల్ల తన డిమాండ్లను కాగితంపై రాసుకుని ట్యాంక్ ఎక్కాడు. రెండు గంటలపాటు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు వినోద్‌ను కిందకు దింపారు.
ఇవీ చూడండి: సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్టు