తెలంగాణ రాష్ట్రంలో సేంద్రీయ సాగుపై దృష్టి సారించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో ఆయన పర్యటించారు. స్వగ్రామానికి వచ్చిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో విద్యాసాగర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.
ఇవీ చూడండి: 'సమ్మెలో పాల్గొన్న వారిని తిరిగి తీసుకోవద్దు'