ETV Bharat / state

Lack of protection for handloom storage: వస్త్రానికి రక్షణ కరవు.. గోదాముల్లో పేరుకుపోతున్న కానుకలు

Lack of protection for handloom storage : రాష్ట్రంలో వివిధ పండుగలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. రాష్ట్ర ప్రభుత్వ తరఫున కానుకల కిట్​ను అందిస్తారు. ఇలా ఏటా బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు చీరలను పంపిణీ చేస్తారు. అందుకోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నుంచి కోట్ల మీటర్ల వస్త్రాన్ని విక్రయిస్తోంది. అయితే ఈ వస్త్రాన్ని భద్రపరచడానికి కనీస సౌకర్యాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గోదాముల్లో సరైన స్థలం లేక ఎక్కడికక్కడ పేరుకుపోతోంది.

Lack of protection for handloom, handloom protection problems
వస్త్రానికి రక్షణ కరవు.. గోదాముల్లో పేరుకుపోతున్న కానుకలు
author img

By

Published : Feb 1, 2022, 1:40 PM IST

Lack of protection for handloom storage : టెస్కో సేకరించే వస్తు ఉత్పత్తులను భద్రపరచడానికి చోటు కరవైంది. కోట్లాది రూపాయాల విలువైన ఉత్పత్తులను నెలల తరబడి కనీస రక్షణలేని ప్రాంతాల్లో ఉంచుతున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి ఉత్పత్తి చేసిన వస్త్రానికి... కనీస రక్షణ లేకపోవడంపై పరిశ్రమ వర్గాలనుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

Lack of protection for handloom, handloom protection problems
టర్పాలిన్లతో తాత్కాలిక రక్షణ

ప్రాసెసింగ్ ఇలా..

Sircilla handloom : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నుంచి రాష్ట్ర చేనేత, జౌళిశాఖ... బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్​కు చెందిన కానుకల కోసం సుమారు తొమ్మిది కోట్ల మీటర్ల వస్త్రాన్ని కేటాయిస్తోంది. వీటి విలువ దాదాపు రూ.4వందల కోట్ల పైనే ఉంటుంది. ఈ ఆర్డర్లను మ్యాక్స్ సంఘాలు, ఎన్ఎస్ఈ యూనిట్లకు పంపిణీ చేస్తోంది. ఉత్పత్తి చేసిన వస్త్రాన్ని సేకరించడం.. నాణ్యత పరీక్షలు వంటివి స్థానిక మార్కెట్ కమిటీలో జరుగుతాయి. వస్త్రంలో ఎలాంటి లోపాలు లేవని తేలిన తర్వాత.. ప్రాసెసింగ్, సైజింగ్, ప్యాకింగ్​కు హైదరాబాద్​లోని పరిశ్రమలకు పంపుతారు. ఇలా రోజుకు కొన్ని లక్షల మీటర్ల వస్త్రం ఇక్కడికి వస్తుంది. సెలవు రోజుల్లో ఈ నిల్వలు భారీగా పేరుకుపోతాయి. ఒకేసారి వీటన్నింటిని పరిశీలించి.. పంపే వీలుండదు.

Lack of protection for handloom, handloom protection problems
వస్త్రానికి రక్షణ కరవు.. గోదాముల్లో పేరుకుపోతున్న కానుకలు

రక్షణ వ్యవస్థ కరవు

ప్రస్తుతం బతుకమ్మతో పాటు వివిధ రకాల ఉత్పత్తులన్నీ కలిపి టెస్కో కోటి ఆరు లక్షల మీటర్ల వస్త్రం సేకరించింది. వీటిని జూన్ వరకు ఇక్కడే భద్రపరచాలి. దీనిని మార్కెట్ కమిటీతో పాటు కల్యాణమండపం, మూతపడ్డ కార్ఖానాల్లో తాత్కాలికంగా నిల్వ చేశారు. మార్కెట్ కమిటీ గోదాము లోపల స్థలం సరిపోకపోవడంతో బయట ఉన్న షెడ్డులో ఉంచారు. వీటిపై చిరిగిన టార్పాలిన్లు అరకొరగా కప్పి ఉంచారు. చుట్టూ గృహాలు ఉన్న ఈ గోదాముకు సరైగా ప్రహారీ గోడలులేవు. ఏదైనా ప్రమాదం జరిగితే కనీస రక్షణ వ్యవస్థలేదు. ఇలా కోట్ల రూపాయాల విలువైన వస్త్రం నిల్వ ఉన్న చోట అగ్నిమాపక వ్యవస్థ ఉండాలి.

చేనేత నిల్వకు కనీస రక్షణ కరవు

పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు

జిల్లా పరిశ్రమ నుంచి ఆరేళ్లుగా పెద్దమొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. ఏడాదిలో ఆరునెలలకు పైనే వస్త్ర ఉత్పత్తుల సేకరణ కొనసాగుతోంది. టెస్కోకు ఇక్కడ గోదాముల, నాణ్యత పరీక్షలకు కార్యాలయం లేదు. చేనేత, జౌళిశాఖ మంత్రిగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని పరిస్థితి ఇలా ఉంది. కనీసం అలాంటి ప్రతిపాదనలేవీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదంటే ఎంతటి నిర్లక్ష్య వ్యవస్థ ఉందో అర్ధమవుతోందని పరిశ్రమ వర్గాల వారు అంటున్నారు.

ఇదీ చదవండి: Covid Employment: కరోనా వేళ కార్మికులకు అండ.. చేనేత ఉత్పత్తుల ప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.