ETV Bharat / state

సిరిసిల్ల చీరలకు ఫిదా అయిన అమెరికా రీసెర్చ్​ స్కాలర్​

Sirisilla sarees: సిరిసిల్ల నేతన్నల నైపుణ్యానికి అమెరికా చేనేత నిపుణురాలు, రీసెర్చ్ స్కాలర్ కైరా జఫ్‌ మెచ్చుకున్నారు. అక్కడ చేనేత వస్త్రాలను పరిశీలించిన కైరా.. నేతన్నల ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల చీరలను కట్టుకొని చేనేత కళ నుంచి మరమగ్గాల వైపు మళ్లిన చరిత్రను అడిగి తెలుసుకున్నారు.

Kyra Juff
Kyra Juff
author img

By

Published : Dec 5, 2022, 10:30 PM IST

Sirisilla sarees: అమెరికా చేనేత నిపుణురాలు, రీసెర్చ్​ స్కాలర్​ కైరా జఫ్​ ఉమ్మడి కరీంనగర్​లోని సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్​తో ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు, నైపుణ్యం వంటి వాటిపై సమగ్రమైన అధ్యయనం చేస్తున్న కైరా తన అధ్యయనంలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల చేనేత చీరలను ఆసక్తిగా తిలకించిన ఆమె.. వాటిని కట్టుకొని మురిసిపోయారు.

చేనేత నైపుణ్య నిపుణురాలైన ఆమె అక్కడ నేతన్నలు చేనేత కళ నుంచి మర మగ్గాలవైపు మళ్లిన చరిత్రను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలో మగ్గాలపై నేస్తున్న బట్టలను, వారి నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి చేనేత ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్​ను కలసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులను, ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు. ఈ సందర్భంగా ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్లో నేతన్నలకు ఎదురైన ఇబ్బందులు పరిశ్రమ సంక్షోభం దాని నుంచి బయటపడిన విధానం అందుకు ప్రభుత్వం అందించిన సహకారం నేతన్నలు ఆమెకు వివరించారు. చేనేత వస్త్రాలపై అధ్యయనంలో భాగంగా దేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, యూపీ మొదలగు రాష్ట్రాలలో కైరా పర్యటించారు.

సిరిసిల్ల చీరలకు ఫిదా అయిన అమెరికా రీసెర్చ్​ స్కాలర్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.