ETV Bharat / state

రాష్ట్రానికి అవార్డుల పంట.. మంత్రి ఎర్రబెల్లికి కేటీఆర్ అభినందనలు - కేటీఆర్ తాజా వార్తలు

KTR Tweet on Swachh survekshan Awards: కేంద్ర ప్రభుత్వం 2023గాను ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డులలో రాష్ట్రానికి పలు అవార్డులు వచ్చాయి. మొదటి మూడు స్థానాల్లో తెలంగాణ జిల్లాలే నిలిచాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభినందనలు తెలిపారు.

KTR
KTR
author img

By

Published : Jan 5, 2023, 10:50 AM IST

KTR Tweet on Swachh Survekshan Awards: స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్‌లో రాష్ట్రానికి పలు అవార్డులు వచ్చాయి. తొలి 3 స్థానాల్లో రాష్ట్రానికి చెందిన జిల్లాలే నిలిచాయి. 2022 డిసెంబర్‌కు సంబంధించి ఈ అవార్డులు వచ్చాయి. నాలుగు స్టార్ల రేటింగ్‌లో మొదటి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, రెండో స్థానంలో కరీంనగర్ జిల్లా, మూడో స్థానంలో పెద్దపల్లి జిల్లాకు అవార్డులు వచ్చాయి.

ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభినందనలు తెలిపారు. స్వచ్ఛత విషయంలో కేంద్రం ఈ అవార్డులు ఇస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయడంతోనే ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డుల గెలుపుకు కారణమైన సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జిల్లా అధికారులు, సర్పంచి, వార్డుమెంబర్లు, క్షేత్రస్థాయిలో పని చేసే పంచాయతీ సెక్రటరీతో పాటు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.