ETV Bharat / state

KTR on TS Assembly Elections 2023 : 'వచ్చే ఎన్నికల్లో మందు పోయించను.. పైసలు పంచను..' - KTR development programs in Vemulawada

KTR on TS Assembly Elections 2023 : ప్రజల దయ ఉంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని మంత్రి కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక వేళ గెలవకపోతే ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటానని ఆయన పేర్కొన్నారు. అంతే గానీ మందు పోయించి.. పైసలు పంచే చిల్లర రాజకీయం మాత్రం చేయనని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. అర్హులైన బీసీలకు బీసీ బంధు కింద రూ. లక్ష చెక్‌లు పంపిణీ చేశారు.

Minister KTR Vemulawada tour
KTR on TS Assembly Elections 2023
author img

By

Published : Aug 8, 2023, 5:04 PM IST

Updated : Aug 8, 2023, 5:37 PM IST

KTR on TS Assembly Elections 2023 : 'వచ్చే ఎన్నికల్లో మందు పోయించను.. పైసలు పంచను..'

KTR on TS Assembly Elections 2023 : పని చేసే ప్రభుత్వాలను ప్రజలు కాపాడుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రజలకు సూచించారు. ఓట్ల కోసం మందు పోయించి, పైసలు పంచేవారిని నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. అనంతరం లబ్ధిదారులకు బీసీ బంధు పథకం చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. కేసీఆర్‌ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రానికి ఎటువంటి ఢోకా ఉండదని అభిప్రాయపడ్డారు.

వేముల నియోజకవర్గంలో తొలి విడతలో 600 మందికి బీసీ బంధు కింద చెక్కులు పంపిణీ చేయడం జరుగుతోందని.. అనంతరం మరోసారి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో 800 ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని ప్రకటించారు. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద వేములవాడ నియోజకవర్గంలో 3 వేల మంది లబ్ది పొందినట్లు గుర్తు చేశారు. కేసీఆర్‌ తొమ్మిదేళ్లు పరిపాలన సంక్షేమంలో స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చునని కొనియాడారు.

Dalit Bandhu 2nd Phase : 'ఎమ్మెల్యేలు చెప్పిన వారికే దళితబంధు..' రెండో విడతలోనూ సేమ్​ టు సేమ్

KTR Development Programs in Vemulawada : పేదలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కులవృత్తుల వారి కోసం పథకాలు తీసుకొచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఆర్థికంగా అడుగున ఉన్న వారి కోసం దళితబంధు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. 14 రకాల వృత్తులపై ఆధారపడిన వారి కోసం బీసీ బంధు అమలు చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. బీసీ బంధు కోసం జిల్లాలో 10 వేల దరఖాస్తులు వచ్చాయని.. తొలి విడతలో 600 మందికి ఇస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు.

KTR Development Programs at Sirisilla : ఈ సందర్భంగా విపక్షాలపై తనదైన శైలిలో కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. గత 50 ఏళ్లుగా అభివృద్ధి చేయని పార్టీలు.. ఇప్పుడేం చేస్తాయని నిలదీశారు. ఓట్ల కోసం విపక్ష నేతలు వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలని సూచించారు. ప్రజలు చైతన్యం ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అండగా ఉంటానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కేటీఆర్‌ వెంట స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

"దేశంలో ఎక్కడా లేని విధంగా 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మి పథకం కింద నిధులిచ్చాం. సెప్టెంబర్‌లో సిరిసిల్లలో మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. రైతు బీమానే కాదు.. నేతన్న బీమా కూడా మొదలు పెట్టాం. ఓట్ల కోసం విపక్ష నేతలు వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలి. 50 ఏళ్లుగా చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని నిలదీయాలి. ఓట్ల కోసం మందు పోయించి, పైసలు పంచేవారిని నమ్మవద్దు. ఓట్ల కోసం నా జీవితంలో మందు పోయలేదు.. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లోనూ మందు పోయించను.. పైసలు పంచను. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేకపోతే ఇంట్లో కూర్చుంటా."- కేటీఆర్‌, ఐటీ మంత్రి

Telangana BCs Scheme : బీసీ ఆర్థిక సాయం రూ.1లక్ష కోసం.. అవస్థలు పడుతున్న ప్రజానికం

Telangana BCs Rs 1 Lakh Scheme : నేటితో గడువు ముగిసింది.. ఇన్​కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు మాత్రం అందలేదు..

KTR Fires at Central Government : 'నేతన్నలపై.. రాష్ట్ర సర్కార్ వరాల జల్లు '

Last Updated : Aug 8, 2023, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.