ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్​ వ్యాప్తంగా నిరాడంబరంగా రాములోరి కల్యాణం

author img

By

Published : Apr 2, 2020, 8:53 PM IST

ప్రతి ఏటా భక్తుల కోలాహలం మధ్య కనులవిందుగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణం.. ఈ సంవత్సరం నిరాడంబరంగా జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు లేక ఆలయాలన్నీ బోసిపోయాయి. కొన్ని చోట్ల మాత్రం పరిమిత సంఖ్యలో భక్తులు హాజరై.. స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

joint-karimnagar-wide-modest-sriramanavami-celebrations
ఉమ్మడి కరీంనగర్​ వ్యాప్తంగా నిరాడంబరంగా రాములోరి కల్యాణం

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజవకర్గంలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితులు ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి.. కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు.

నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్‌ మండలాల్లోని పలు ఆలయాల్లో అర్చకులు కల్యాణ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులను అనుమతించలేదు.

కొత్తపల్లిలో..

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామ ఆలయంలో వేద పండితుల నడుమ స్వామి వారి కల్యాణం నిరాడంబరంగా జరిగింది. కల్యాణానికి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు హాజరయ్యారు. వేడుకల్లో శ్రీ సచ్చిదానంద ఆశ్రమం నిర్వాహకులు, కొత్తపల్లి పురపాలక సంఘం ఛైర్మన్ రుద్రరాజు, వైస్ ​ఛైర్మన్ గోపాల్​రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గోపాల్​రావుపేటలో..

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్​రావుపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులు హాజరు కాగా.. సీతారాముల కల్యాణోత్సవాన్ని పూజారులు ఘనంగా నిర్వహించారు.

మెట్​పల్లిలో..

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అర్చకుల వేద మంత్రాల మధ్య కన్నుల పండువగా జరిగింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏటా రాముల వారి కల్యాణం వేలాది మంది భక్తుల మధ్య జరిగేది. కరోనా వైరస్ ప్రభావం వల్ల.. ఈ సంవత్సరం కేవలం 12 మంది భక్తులు మాత్రమే కల్యాణానికి హాజరయ్యారు.

కొండగట్టులో..

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో రాములోరి కల్యాణం నిరాడంబరంగా జరిగింది. కేవలం అర్చకులు, ఆలయ అధికారులు మాత్రమే హాజరైన స్వామి వారి కల్యాణం.. శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకముందు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోదావరిఖనిలో..

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిగింది. ఆలయ ఈవో శంకరయ్య స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.

స్వామివారి కల్యాణం భక్తులు లేకుండానే జరిగింది. వచ్చే ఏడాది సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు మధుసూదనాచార్యులు తెలిపారు .

వేములవాడలో..

హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. తెల్లవారుజామున నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కల్యాణ వేడుకలను నిర్వహించారు.

అనంతరం దేవాలయ ఆవరణలోని వేదిక వద్ద పూర్ణాహుతి జరిగింది. కరోనా వైరస్ ప్రభావంతో భక్తులను కల్యాణానికి అనుమతించకపోవడం వల్ల కల్యాణం ఏకాంతంగా జరిగింది. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా జరిగే రథోత్సవం రద్దు కాగా.. రాత్రి కల్యాణ మండపంలో శృంగార వసంతోత్సవం కూడా ఏకాంతంగానే జరగనుంది.

కాళేశ్వరంలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ సీతారాముల కల్యాణం అర్చకుల వేదమంత్రాల మధ్య రమణీయంగా జరిగింది. మొదటగా సీతారాముల విగ్రహాలను ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసి, గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ పూజ, జీలకర్ర బెల్లం, మహా సంకల్ప పఠణం, మాంగల్య పూజ, ధారణ, పుష్పమాల ధారణ, తలంబ్రాల ఘట్టం మొదలగు వైదిక క్రతువులను నిర్వహించారు.

అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. కరోనా వ్యాధి ప్రబలుతుండడం వల్ల భక్తులెవరినీ అనుమతించకుండా అర్చకులు మాత్రమే స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.

ఇవీచూడండి: కుమారుడు ఎదుటే తండ్రిని కొట్టిన కానిస్టేబుల్​.. కేటీఆర్​ ట్వీట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.