రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన లావణ్య వేములవాడలోని కస్తూర్బాగాంధీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. బైపీసీ ప్రథమ సంవత్సరం పరీక్ష రాసింది. ఫలితాల్లో తప్పానని తీవ్రమస్తాపంతో మూడు రోజుల కిందట ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన సిరిసిల్లలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
మూడురోజులుగా మృత్యువుతో పోరాటం...
మూడు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న విద్యార్థిని ఇవాళ తుదిశ్వాస విడిచింది. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కనీసం తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందించలేక పోయామంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
ఇది ప్రభుత్వ వైఫల్యమే
మృతురాలి కుటుంబాన్ని భాజపా అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ పరామర్శించారు. విద్యార్థుల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.