ETV Bharat / state

బతుకమ్మ చీరలతో నేతన్నలకు పెరిగిన ఉపాధి - బతుకమ్మ చీరలు

నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల తయారీ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ఏటా మరమగ్గాల సంఖ్య బాగానే పెరుగుతోంది. వీటిపైనే తయారీ శరవేగంగా సాగుతోంది. అనుబంధ రంగాలకు చెందిన కార్మికులకూ ఉపాధి దొరుకుతోంది. పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన బాధ తప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్మికుల నైపుణ్యాలు పెంచటంలోనూ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది.

bathukamma
author img

By

Published : Sep 21, 2019, 8:07 PM IST

బతుకమ్మ చీరలతో నేతన్నలకు పెరిగిన ఉపాధి

బతుకమ్మ చీరల తయారీ కోసం గతేడాది రూ.290 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈసారి ఆ నిధులు రూ.320కోట్లకు పెంచింది. 122 మ్యాక్స్‌ సొసైటీలతో పాటు సిరిసిల్ల టెక్స్​టైల్ పార్క్‌‌లోని వస్త్ర పరిశ్రమలో సుమారు 17వేల మరమగ్గాలపై బతుకమ్మ చీరల తయారీ శర వేగంగా సాగుతోంది. మరమగ్గాల కార్మికులతో పాటు అనుబంధ రంగాల్లో పని చేస్తోన్న దాదాపు 30వేలకు పైగా కార్మికులకు గిట్టుబాటు కూలీ అందుతోంది. ఆసాములకు, యజమానులకు పూర్తిస్థాయిలో పని అందిస్తోంది. ఈ క్రమంలో బతుకమ్మ చీరల తయారీ నేతన్నలకు భరోసా కల్పిస్తోంది.

నవీకరణకు నిధులు

పనులు లభించక నేతన్నలు భీవండి, సూరత్ ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితుల నుంచి ఇంటి వద్ద ఉండి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న మరమగ్గాలు దాదాపు 3దశాబ్దాల క్రితం సూరత్‌ తదితర ప్రాంతాల నుంచి సెకండ్ హ్యాండ్‌గా కొనుగోలు చేసి తీసుకొచ్చినవే. అందువల్ల నాణ్యత గల వస్త్రాలు ఉత్పత్తి చేసే పరిస్థితి ఉండదు. మరమగ్గాల నవీకరణతో పాటు జియోట్యాగింగ్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి వారి సామర్థ్యం పెంచేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది.

పెరిగిన ఆదాయం

సిరిసిల్ల, తంగళ్లపల్లి, చంద్రంపేట ప్రాంతాల్లో దాదాపు 25వేలకుపైగా మరమగ్గాలు కుటీర పరిశ్రమలుగా నడుస్తున్నాయి. గతంలో కార్మికుడు 12గంటలు పనిచేసినా నెలకు రూ.8వేల నుంచి రూ.10వేల కూలీ లభించేది. ప్రస్తుతం బతుకమ్మ చీరల కారణంగా కూలీ నెలకు రూ.16నుంచి రూ.18వేల వరకు అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వస్త్ర ఉత్పత్తిలో ఎక్కడ నాణ్యతకు రాజీపడటం లేదు... చేనేత జౌళిశాఖ. రోజు ఇద్దరు అధికారులు నాణ్యత పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

100 రకాల డిజైన్లు

ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బతుకమ్మ చీరల నాణ్యతపై మహిళల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందు ఇక్కడ తయారైన వస్త్రాలు హైదరాబాద్‌కు తరలించి అక్కడ ప్రాసెసింగ్‌ చేయించే వారు. ప్రస్తుతం ఆ పనులు కూడా ఇక్కడి వారికే అప్పగించడం వల్ల వారిలో ఆనందం వ్యక్తం అవుతోంది. మొత్తం 100 రకాల డిజైన్లతో తయారవుతున్న ఈ చీరలు అందరికీ నచ్చుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

80శాతం పూర్తి

ప్రభుత్వం చీరల ఉత్పత్తి కోసం నిర్దేశించిన లక్ష్యం దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం పైగా చీరల తయారీ పూర్తైందని... నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం బతుకమ్మ చీరల కారణంగా తమకు ఉపాధి పెరిగిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్న కార్మికులు ఈ పనులు ఏడాది పొడవునా ఉండేలా చూడాలని కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: రంగురంగుల కోకలు... మన బతుకమ్మ చీరలు...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.