ETV Bharat / state

CHENNAMANENI CASE: 'చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారు' - chennamaneni ramesh case hearing in high court

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. కేంద్రం తరఫున ఏఎస్​జీ రాజేశ్వరరావు, చెన్నమనేని తరఫున న్యాయవాది రామారావు, పిటిషనర్‌ ఆది శ్రీనివాస్ తరఫున రవికిరణ్ వాదనలు వినిపించారు.

CHENNAMANENI: చెన్నమనేని పౌరసత్వ వివాదంపై విచారణ.. ఈ నెల 24కి వాయిదా

author img

By

Published : Aug 10, 2021, 3:56 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదంపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో కాంగ్రెస్​ నేత ఆది శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవాళ మరోసారి విచారణ జరగ్గా.. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సాలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) రాజేశ్వరరావు, చెన్నమనేని తరఫున న్యాయవాది రామారావు, పిటిషనర్‌ ఆది శ్రీనివాస్ తరఫున రవికిరణ్ వాదనలు వినిపించారు. చెన్నమనేని రమేశ్​ జర్మనీ పౌరుడేనని ఏఎస్‌జీ రాజేశ్వరరావు మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఓసీఐ దరఖాస్తులోనూ జర్మనీ పౌరుడుగా ప్రస్తావించారని.. జర్మనీ పాస్‌పోర్టును 2023 వరకు పునరుద్ధరించుకున్నారని న్యాయవాది రవికిరణ్ వాదనలు వినిపించారు. చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారని రమేశ్​ తరఫు న్యాయవాది రామారావు కోర్టుకు వివరించారు. పౌరసత్వాన్ని వదులుకున్నట్లయితే ఓసీఐ దరఖాస్తులో జర్మనీ పౌరుడిగా ఎలా పేర్కొన్నారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకొని న్యాయస్థానానికి వివరిస్తామని రామారావు పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

సంబంధిత కథనాలు..

'వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ జర్మనీ పౌరుడే'

హైకోర్టులో కేవియట్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.