ETV Bharat / state

సిరిసిల్లలో మొక్కల పంపిణీకి పూర్తయిన ఏర్పాట్లు - రాజన్న సిరిసిల్ల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రతి పల్లెలో మొక్కలు నాటేందుకు గ్రామల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అధికారులు మొక్కలను పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు.

మొక్కల పంపిణీకి పూర్తయిన ఏర్పాట్లు
author img

By

Published : Apr 16, 2019, 10:10 PM IST

సిరిసిల్ల జిల్లాలోని గ్రామాలను హరిత వనంగా మార్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. నర్సరీల ద్వారా మొక్కలను పంపిణీ చేయనున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఉసిరి, జామ, అల్లనేరేడు, గులాబీ, గన్నేరు, దానిమ్మ, సీతాఫలాలు, పండ్లు, పూలు నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నారు. వచ్చే జూన్, జూలైలో పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల మొక్కలు ఎండిపోకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో 50 వేల మొక్కలను పంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. తంగళ్లపల్లి, సిరిసిల్ల మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో 15 లక్షల మొక్కలు నాటనున్నారు.

మొక్కల పంపిణీకి పూర్తయిన ఏర్పాట్లు

ఇవీ చూడండి: ప్రయాణికుల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

Intro:TG_KRN_61_16_SRCL_NARSARILA_YERPATTLU_AVB_G1_HD

( )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం లో భాగంగా ప్రతి పల్లెలో మొక్కలు నాటేందుకు గ్రామ నర్సరీలను ఏర్పాటు చేశారు. గ్రామాలు హరిత వనం గా మార్చడానికి అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి నర్సరీ లో పెరిగిన మొక్కలను అదే గ్రామంలో పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. గతంలో ప్రజలకు ఉపయోగం లేని మొక్కలను పంపిణీ చేయడం వల్ల మొక్కల పెంపకంలో ప్రజలు నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోయారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామానికో నర్సరీ ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే ఉసిరి, జామ, అల్లనేరేడు, గులాబీ, గన్నేరు, దానిమ్మ, సీతాఫలాలు, పండ్లు పూలు నీడనిచ్చే మొక్కలను నర్సరీలో పెంచుతున్నారు. వచ్చే జూన్, జూలైలో గ్రామాల్లో పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ప్రతి గ్రామంలో లో 50 వేల మొక్కలను పంపిణీ చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. తంగళ్ళపల్లి, సిరిసిల్ల మండలం లోని 30 గ్రామ పంచాయతీల్లో 15 లక్షల మొక్కలను నాటేందుకు నర్సరీలో మొక్కలను పెంచుతున్నారు.

బైట్ : నాగరాజు, ఏపీవో, సిరిసిల్ల.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా లో ని ప్రతి గ్రామంలో 50 వేల మొక్కలు లక్ష్యంగా నర్సరీల ఏర్పాటు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.