ETV Bharat / state

80 ఏళ్ల వయసులో కరోనాను జయించిన బామ్మ - rajanna siricilla district news

కరోనా.. ఈ పేరు వినగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతోంది. ప్రత్యేకించి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు భయంతో హడలెత్తిపోతున్నారు. అయితే మందులు లేని ఈ మహమ్మారిని కొందరు వృద్ధులు మనోధైర్యంతో జయిస్తున్నారు. వయస్సు మీద పడినప్పటికీ ... ప్రమాదకర వైరస్​పై విజయం సాధిస్తూ... అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Grandmother conquered the corona at the age of 80 in rajanna siricilla district
80 ఏళ్ల వయసులో కరోనాను జయించిన బామ్మ
author img

By

Published : Aug 15, 2020, 9:36 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పత్తిపాటి లక్ష్మమ్మ(80) అనే వృద్ధురాలు కరోనాను జయించింది. లక్ష్మమ్మ కరోనా పాజిటివ్​ లక్షణాలతో గత నెల 28న సిరిసిల్ల పట్టణంలోని కొవిడ్​ ఆసుపత్రిలో చేరింది. 80 సంవత్సరాల వృద్ధురాలు అయినప్పటికీ వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపి చికిత్స అందించారు.

శుక్రవారం సాయంత్రం మరోసారి కొవిడ్​ పరీక్షలు చేయగా.. నెగెటివ్​ రావడం వల్ల ఇంటికి పంపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలపై వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: గల్వాన్​ లోయ యోధులకు శౌర్య పతకం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.