రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ప్రభుత్వం లాక్డౌన్లో సడలింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వ నిబంధనలతో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. సోమవారం కావడం వల్ల ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.
ఆలయ యంత్రాంగం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తోంది. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నారు. ఆలయ క్యూలైన్లలో వ్యక్తిగత దూరం పాటిస్తూ దర్శనాలు చేసుకుంటున్నారు.
ఇవీ చూడండి: దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి