ETV Bharat / state

దళిత బంధు నిధులతో రైస్‌మిల్లు.. ఈ యూనిట్‌ రాష్ట్రానికే ఆదర్శం: కేటీఆర్‌

author img

By

Published : Mar 27, 2023, 3:48 PM IST

Updated : Mar 27, 2023, 4:38 PM IST

రాష్ట్రంలో దళితబంధు నిధులతో నిర్మించిన మొట్ట మొదటి రైస్ మిల్లును రాష్ట్ర మంత్రి కే తారక రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామంలో ప్రారంభించారు. ఈ మిల్లు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

first rice mill built with dalitha bandhu funds in rajanna siricilla district
దళితబంధు నిధులతో రైస్ మిల్లు.. ప్రారంభించిన కేటీఆర్

రాష్ట్రంలో దళిత బంధు నిధులతో నిర్మించిన మొట్ట మొదటి రైస్ మిల్లును రాష్ట్ర మంత్రి కే తారక రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామంలో ప్రారంభించారు. దళితబంధుతో వచ్చిన డబ్బులతో కొంతమంది కలిసి ఈ రైస్ మిల్లును ఏర్పాటు చేసుకున్నారు. దీని ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. లబ్దిదారులకు పలు సూచనలు ఇస్తూ.. దళిత బంధు గురించిన పలు అంశాలను గురించి చర్చించారు.

దళితబంధు నిధులతో రైస్ మిల్లు: ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన సుదామల్ల రాజేశ్వరి, సుదామల్ల విజయ్ కుమార్, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్య గ్రూపుగా ఏర్పడి ఈ రైస్ మిల్లును ఏర్పాటు చేసుకున్నారు. రాజేశ్వరి భర్త సురేందర్, లింగయ్యలకు ఇప్పటికే లారీలు ఉన్నాయి. విజయ్ కుమార్ గల్ఫ్ నుంచి తిరిగొచ్చాడు. 30 లక్షల రూపాయలు పెట్టి మల్లారెడ్డిపేట మండలం దుమాల శివారులో మూడెకరాల భూమిని కొనుగోలు చేశారు. ముగ్గురికి దళితబంధు స్కీమ్ ద్వారా 30లక్షల రూపాయలు వచ్చాయి. ఈ రూ.30లక్షలతో పాటు బ్యాంక్ నుంచి మరికొంత డబ్బును పొందారు. ఇవన్నీ డబ్బులు పోగుచేసుకుని వీరందరూ గ్రూపుగా ఏర్పడి రైస్ మిల్లులను నిర్మించుకున్నారు. ఇటీవలే ఈ రైస్ మిల్లు నిర్మాణం అనేది పూర్తయ్యింది. మిల్లును ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరై మిల్లును ప్రారంభించారు.

ముందుచూపుతో.. దళితబంధు: ఈ రైస్ మిల్లు ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. దళితులు ఆర్థికంగా, అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతోనే... ముందుచూపు గల రైతు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ద‌ళిత బంధు లబ్ధిదారులను రైస్ మిల్లు స్థాపన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనిట్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరుకున్నారు. ద‌ళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ద‌ళిత బంధు ఎంతో దోహ‌దం చేస్తుంద‌న్నారు.

దళిత బంధు పథకం నిధులతో రైస్‌మిల్లు స్థాపించాలన్న ఆలోచన రావడం గొప్ప నిర్ణయమని మంత్రి అన్నారు. ఇది అందరికి ఆదర్శవంతమైనది అని కేటీఆర్ వారిని ప్రశంసించారు. ఈ యూనిట్​కు బీమా తప్పకుండా చేయించాలని లబ్దిదారులకు సూచించారు. యూనిట్ చాలా గొప్పగా ఉందని, రైస్ మిల్ యూనిట్ విజయవంతంగా లాభాల మార్గంలో నడవాలని ఆయన ఆకాక్షించారు. మిగతా లబ్ధిదారులకు ఇది ఆద‌ర్శంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు లభ్దిదారులు, కుటంబ సభ‌్యులతో మంత్రి ముచ్చటించారు. రాష్ట్రం మొత్తానికి రైస్ మిల్ యూనిట్ ఆదర్శం కావాలన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 27, 2023, 4:38 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.