రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ఆటోమొబైల్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి దుకాణంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న వారు మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ అప్పటికే షాపులోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వచ్చినట్లు బాధితుడు శంకర్ తెలిపారు.