రాజన్న సిరిసిల్ల జిల్లా జయవరం గ్రామ రైతులు వేములవాడ పట్టణంలోని ఎరువుల దుకాణంలో మొక్కజొన్న విత్తనాలు తీసుకొని 80 ఎకరాల్లో పంటను సాగు చేశారు. నకిలీ విత్తనాలు కావటం వల్ల సుమారు 75 శాతం పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటను వ్యవసాయ అధికారులు అంచనాలు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పంటకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు అధికారులను కోరారు.
ఇదీ చూడండి : పోలీస్ దొంగయ్యాడు.. అలా దొరికిపోయాడు..