ETV Bharat / state

మధ్య మానేరు ప్రాజెక్టు వద్ద సీపేజీ ప్రాంతంలో తవ్వకాలు - మధ్యమానేరు ప్రాజెక్టు ఆనకట్ట

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మధ్యమానేరు జలాశయంలో సీపేజీ ఉన్న ప్రాంతంలో తవ్వకాలు మొదలయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఎన్నో ఆరోపణలు రాగా అధికారులు రంగంలోకి దిగారు. సుమారు 5 మీటర్ల మేర కట్టను తవ్వి పరిశీలించనున్నారు.

Excavations at Seepage Area at Middle Maneru Project
author img

By

Published : Oct 11, 2019, 9:48 PM IST

రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిర్మించిన మధ్యమానేరు ప్రాజెక్టు ఆనకట్టలో చౌడునేల ఉన్న భాగాన్ని తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపణలు వెలువెత్తిన తరుణంలో ప్రభుత్వం మట్టికట్ట నాణ్యతను పరిశీలించింది. మట్టి కట్టలోని 2,475 మీటర్ల నుంచి 2,675 మీటర్ల వరకు గల మట్టి కట్టలో చౌడు మట్టి ఉన్నట్లు తేలింది. ఆ ప్రాంతంలో మట్టి కట్టను లోతుగా పరిశీలించాలని డ్యాం సేఫ్టీ బృందం నిర్ణయించినట్లు సమాచారం. నీలోజుపల్లి నుంచి కొత్తపేట వెళ్లే శివారులోని బోగం ఒర్రె వద్ద పునాదులు సరైన రీతిలో నిర్మించలేదన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలో దాదాపు 200 మీటర్ల వరకు మట్టికట్టను ప్రోక్లెయిన్లతో తవ్వుతున్నారు. సుమారు 5 మీటర్ల మేర కట్టను తవ్వుతున్నట్లు సమాచారం.

మధ్య మానేరు ప్రాజెక్టు వద్ద సీపేజీ ప్రాతంలో తవ్వకాలు

లీకేజీ కాదు సీపేజీ...

గతేడాది 5 టీఎంసీల నీటిని నిల్వ చేసిన అధికారులు... ఈ యేడాది 15టీఎంసీలు నిల్వచేసేందుకు యత్నించారు. కానీ నీరు లీకేజీ అయినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం లీకేజీ కాదు... ఇంజినీరింగ్ పరిభాషలో సీపేజీగా భావిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టుకు సంబంధించిన 25 గేట్లు ఎత్తి మొత్తం నీటిని దిగువ మానేరుకు విడుదల చేశారు. ప్రస్తుతం మధ్యమానేరులో కేవలం 2.67టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి. మరింత లోతుగా మట్టి కట్టను తవ్విన అనంతరం డ్యాం సేఫ్టీ బృందం పరిశీలించి తగు సూచనలు చేయనున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి: రాజకీయ అరంగేట్రంపై కంగనా ఆసక్తికర సమాధానం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.