ETV Bharat / state

'ప్రభుత్వం ఆదేశించగానే ప్రజలందరికీ వ్యాక్సిన్‌' - Collector Krishna Bhaskar inspecting the vaccination dryer

ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని పీఎస్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. జడ్పీ అధ్యక్షురాలు ఎన్.అరుణతో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ పరిశీలించారు.

Collector inspecting PS Nagar Primary Health Center‌
పీఎస్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌
author img

By

Published : Jan 8, 2021, 10:12 PM IST

ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణం పీఎస్ నగర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. జడ్పీ అధ్యక్షురాలు ఎన్.అరుణతో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ పరిశీలించారు.

ఏర్పాట్ల పరిశీలన..

ఆరోగ్య కేంద్రంలోని వెయిటింగ్ హాల్, వ్యాక్సినేషన్, పరిశీలన గదుల ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు. వ్యాక్సినిచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంజక్షన్ తీసుకున్నాక ఏర్పడే దుష్పపరిణామాల (AEFI) నివారణ గురించి వివరించారు.

జిల్లాలో మొత్తం 16 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ప్రజలందరూ టీకా తీసుకోవాలి. ఆరోగ్య సిబ్బంది బలవంతం చేయొద్దు. ఎవరికి వారు ఇష్ట ప్రకారమే టీకా వేయించుకోవాలి. సమాచారాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలుసుకోవాలి.

-కృష్ణ భాస్కర్, జిల్లా కలెక్టర్

సెల్‌ఫోన్‌కు..

హెల్త్‌కేర్‌‌, అంగన్‌వాడి సిబ్బందికి వ్యాక్సినేషన్ మొదట వేయడం జరుగుతుందని, తరువాత మిగతా వారికి ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్‌కు రావాల్సిన తేదీ, స్థలం, సమయ సమాచారం సెల్‌ఫోన్‌కు వస్తుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీకి సర్వం సిద్ధం చేశాం. ప్రభుత్వ సిబ్బందికి ముందుగా టీకా ఇవ్వడం జరుగుతుంది. టీకాపై వచ్చే అపోహలు నమ్మకండి. ప్రజలందరూ టీకా వేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా.

-ఎన్.అరుణ, జడ్పీ అధ్యక్షురాలు

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, మున్సిపల్ ఛైర్మన్ జిందం.కళా, వైస్‌ఛైర్మన్ మంచె.శ్రీనివాస్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా.సుమన్ మోహన్ రావు, ప్రోగ్రాం ఆఫీసర్లు డా.బి.శ్రీరాములు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ పరిశీలన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.