ETV Bharat / state

వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల నిరసన - వసతి గదులపై జీఎస్టీ రద్దుకు బీజేపీ నాయకుల డిమాండ్‌

Devotees Protest Against Vemulawada Temple Dormitory GST : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో వసతి గదులకు పెంచిన జీఎస్టీని రద్దుచేయాలని బీజేపీ నాయకులు ఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గదుల అద్దెకు సంబంధించి 12 శాతం జీఎస్టీ విధించడంతో, భక్తులకు ఆర్థిక భారంగా మారుతుందన్నారు. ఏటా రాజన్న దేవాలయానికి కోట్లలో ఆదాయం వస్తున్నప్పటికిీ భక్తులకు సరైన వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. తక్కువ ధరలో వసతి గదులు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం, ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 5:34 PM IST

Vemulawada Temple Dormitory GST News
Devotees Protest Against Vemulawada Temple Dormitory GST

Devotees Protest Against Vemulawada Temple Dormitory GST : దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వసతి గదుల అద్దె చెల్లింపు(Rent Payment) భక్తులకు భారంగా మారింది. ఆలయ వసతి గదుల అద్దెకు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి వస్తుండడంతో భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతుంది.

Rajanna Temple: కోడె మొక్కులు తీర్చుకునేందుకు బారులు తీరిన భక్తులు

రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి నందీశ్వర కాంప్లెక్స్, లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ , అమ్మవారి కాంప్లెక్స్ , పార్వతీపురం, భీమేశ్వర సదన్, గెస్ట్ హౌస్(Guest House) కలిపి మొత్తం 435 గదులు, 12 సూట్లు ఉన్నాయి. కాగా ఆయా గదుల అద్దెకు సంబంధించి 12 శాతం జీఎస్టీ విధించడంతో భక్తులపై అదనపు భారం పడుతోంది. ఈనెల 4 నుంచి ఆలయ వసతి గదులకు అద్దెతో కలిపి జీఎస్టీ అదనంగా భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు.

రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆది, సోమ, శుక్రవారాలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తుంటారు. అనేక మంది భక్తులు ఇక్కడ నిద్ర చేసిన అనంతరం మరుసటి రోజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. వసతి గదులు అద్దె చెల్లించలేని భక్తులు ఆలయ ఓపెన్ స్లాబ్(Temple Open Slab), ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తుంటారు.

వేములవాడ రాజ‌న్న స‌న్నిధిలో మ‌హిళ‌ల ఉచిత సేవ‌

గతంలో రూ.300 ఉన్న వసతిగదులను ఇప్పుడు జీఎస్టీ పేరిట రూ. 560 పెంచారు. అప్పటికీ ఇప్పటికీ రూం అయితే ఏమీ మెరుగ్గాలేవు. జీఎస్టీ భారం కూడా పెట్టారు. వసతి మంచిగా ఉంటే ఫర్లేదు కానీ ఇలా పాత సౌకర్యాలే ఉంచి డబ్బులు పెంచటం భారంగా మారింది. జీఎస్టీ భారం రద్దు చేసి, వసతి మెరుగ్గా మార్చితే బాగుంటుంది-రాజన్న భక్తుడు

ఇదే అదునుగా ప్రైవేటు అద్దె గదుల నిర్వాహకులు కూడా ఇస్టానుసారంగా ధరలు పెంచి భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు. కాగా ఏటా రాజన్న ఆలయానికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు సరిపడా వసతులు కల్పించడం లేదన్న అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తం అవుతుంది.

Vemulawada Temple: రాజన్న ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపు.. వివరాలివే!

BJP Leaders Protest on Temple GST Charges : జీఎస్టీ కలిపి అధిక మొత్తంలో అద్దె వసూలు చేస్తున్నప్పటికీ గదుల్లో విద్యుత్తు సదుపాయం, ఏసీలు సరిగా లేవని భక్తులు పేర్కొంటున్నారు. పెంచిన జీఎస్టీని రద్దుచేయాలని బీజేపీ నాయకులు ఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తక్కువ ధరలో వసతి గదులు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం, ఆలయ అధికారులు(Temple Authorities) చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల నిరసన - వసతి గదుల జీఎస్టీ రద్దుపై బీజేపీ నాయకులు డిమాండ్‌

కొవిడ్‌ విజృంభణ.. ఆలయాల్లో నిరాడంబర వేడుకలు

రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.