Rajanna Temple: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. ఆదివారం రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు.
ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలు భక్తిభావంతో నిండిపోయింది. ఆదివారం సెలవుదినం కావడం వల్ల భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
గతనెలలో పెరిగిన టికెట్ల ధరలు...
వేములవాడ రాజన్న ఆలయం(Vemulawada Rajanna Temple)లో ఆర్జిత సేవల టికెట్ల ధరల( ticket prices )ను నవంబర్ నెలలో పెంచారు. ధరలు పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్వామి కల్యాణం టికెట్ ధర రూ.వెయ్యి నుంచి రూ.1,500కు పెంచారు. మహా రుద్రాభిషేకం టికెట్ ధర రూ.600 నుంచి రూ.1,000కి పెంచగా.. అన్నపూజ టికెట్ ధర రూ.600 నుంచి రూ.1,000కి పెంపు చేశారు. సోమేశ్వరాలయ అభిషేకం టికెట్ ధర రూ.500 చేశారు. సోమేశ్వరాలయ అన్నపూజ టికెట్ ధర రూ.500లకు పెంచారు. సత్యనారాయణ వ్రతం టికెట్ ధర రూ.400 నుంచి రూ.600కు పెంపు చేయగా... కుంకుమ పూజ టికెట్ ధర రూ.150 నుంచి రూ.300లుగా చేశారు. భీమేశ్వరాలయ అభిషేకం టికెట్ ధర రూ.200 కాగా.. నవగ్రహపూజ టికెట్ ధర రూ.100 నుంచి రూ.300లు అయింది.
ఆర్జిత సేవలు | గతం ధర | ప్రస్తుతం |
స్వామి కల్యాణం టికెట్ ధర | రూ.1000 | రూ.1500కు పెంపు |
మహా రుద్రాభిషేకం టికెట్ ధర | రూ.600 | రూ.1000కి పెంపు |
అన్నపూజ టికెట్ ధర | రూ.600 | రూ.1000 కి పెంపు |
సోమేశ్వరాలయ అభిషేకం టికెట్ ధర | - | రూ.500కు పెంపు |
సోమేశ్వరాలయ అన్నపూజ టికెట్ ధర | - | రూ.500లకు పెంపు |
సత్యనారాయణ వ్రతం టికెట్ ధర | రూ.400 | రూ.600కు పెంపు |
కుంకుమ పూజ టికెట్ ధర | రూ.150 | రూ.300లకు పెంపు |
భీమేశ్వరాలయ అభిషేకం టికెట్ ధర | - | రూ.200కు పెంపు |
నవగ్రహపూజ టికెట్ ధర | రూ.100 | రూ.300లకు పెంపు |