రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు దిగారు. కార్యాలయం ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. కార్మికులకు రాజన్న సిరిసిల్ల జిల్లా భాజపా అధ్యక్షుడు రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు.
ఇవీ చూడండి: వైరల్: సడన్ బ్రేక్.. దంపతుల ప్రాణాలు సేఫ్